Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నందుకు పాలాభిషేకం : ఎంపీ కోమటిరెడ్డి

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:36 IST)
హామీలు ఇస్తూ క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంద‌ని... అందుకు మంత్ర‌లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. హ‌య‌త్ న‌గ‌ర్ మండ‌లంలో జాతీయ ర‌హ‌దారి-9 నుంచి బ‌లిజ‌గూడ వ‌రకు ఆరేళ్ల క్రితం శంఖుస్థాప‌న చేసి నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ శిలాఫ‌లాకానికి పాలాభిషేకం చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ స‌ర్కార్ వివ‌క్ష‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. తేది. 10.08.2015న అప్ప‌టీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు, మ‌హేంద‌ర్ రెడ్డిలు రూ. 11కోట్ల‌తో జాతీయ‌ర‌హ‌దారి-9 నుంచి దేశ్‌ముఖ్ వ‌యా బ‌లిజ‌గూడ, క‌వాడిప‌ల్లి మీదుగా బీటీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికీ ఆరేళ్లు గ‌డుస్తున్న నిధులు ఎందుకు విడుద‌ల చేయాలేదని.. టెండ‌ర్లు ఎందుకు పిలువ‌లేద‌ని ప్రశ్నించారు. 
 
సీఎం కుటుంబ స‌భ్యులు, మంత్రులు చేసిన శంఖుస్థాప‌న‌ల‌కే దిక్కులేకుంటే ఓ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఏంట‌నీ దుయ్య‌బ‌ట్టారు.  ఉద్యోగులు వారి హ‌క్కులు వారు సాధించుకుంటే పాలాభిషేకాలు చేయించుకునే టీఆర్ఎస్ స‌ర్కార్‌కు.. ఈ ప‌నులు చేయ‌క‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నందుకు నిర‌స‌న‌గా శంఖుస్థాప‌న శిలాఫ‌ల‌కానికి పాలాభిషేకం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ పాలాభిషేకంతోనైనా కేసీఆర్ స‌ర్కార్‌కు క‌నువిప్పు క‌ల‌గాల‌ని వివ‌రించారు. 
కేసీఆర్, టీఆర్ఎస్ స‌ర్కార్ ఎక్కువ రోజులు ప్ర‌జ‌ల‌ను మోసం చేసి రాజకీయాలు చేయాలేర‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల ప‌ట్ల మీ నిర్ల‌క్ష్యవైఖ‌రిని తెలుసుకున్న ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే స‌ర్కార్‌పై తిరుగుబాటు బావుట ఎగుర‌వేస్తార‌ని తెలిపారు. 
 
త్వ‌ర‌గా మంత్రులు, అధికార యంత్రాంగం స్పందించి మోసం చేసినందుకు ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ ప‌నుల‌ను త్వ‌ర‌గా ప్రారంభించ‌కుంటే.. మీరు శంఖుస్ధాప‌న చేసి మోసం చేసిన గ్రామ‌స్థుల‌తో క‌లిసి జాతీయ‌ర‌హ‌దారిని దిగ్భందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న స్వంత జిల్లాకు వంద‌ల కోట్లు ఇస్తున్న కేసీఆర్.. ఇబ్ర‌హీప‌ట్నం నియోజ‌క వ‌ర్గంలో ఆరేళ్లుగా బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్లు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని తెలిపారు. 
 
 
తాను ఎంపీగా గెలిచి రెండేళ్లలోనే ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రంతో కోట్లా‌డి ఎల్‌బీన‌గ‌ర్ నుంచి అందోల్ మైస‌మ్మ వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నుల‌ను రూ. 545 కోట్ల నిధుల‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. వారంరోజుల్లో ఈ ప‌నులకు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు వివ‌రించారు. కానీ రాష్ట్ర స‌ర్కార్ మాత్రం రూ.11 కోట్ల‌ను విడుద‌ల చేయ‌క‌పోవ‌డం విడ్డూర‌మ‌ని వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments