Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఘనంగా బతుకమ్మ పండుగ

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:31 IST)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ పూలపండుగ పాటలు ఊరూవాడా మార్మోగనున్నాయి. ఆడపడచులు ఆడిపాడి ఘనంగా చేసుకునే బతుకమ్మ సంబురాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై... తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ వరకూ ఇంటింటా సంబురాలు సాగనున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో పూల పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్, మండల కేంద్రాల బతుకమ్మ ఉత్సవ ప్రాంగణాల వద్ద, నిమజ్జనాలు జరిగే చెరువులు, కుంటల వద్ద విద్యుత్ దీపాల అలంకరణలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్​లోని ట్యాంక్ బండ్, పీపుల్స్​ ప్లాజా, ఇతర ప్రధాన ప్రాంతాలు, కూడళ్లలో అలంకరణలు చేపట్టారు.

తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఆ తర్వాతి రోజుల్లో అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు, నానేబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయ, వెన్నముద్దల బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments