బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపు: 170 మంది ముందస్తుగా అరెస్ట్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (15:34 IST)
బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. సోమవారం బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్‌లో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దించారు. ఈ సందర్భంగా సీపీ నాగారాజు మాట్లాడుతూ.. బోధన్ లో ప్రశాంతంగా బంద్‌ కొనసాగుతోందన్నారు.
 
నిన్నటి ఆందోళనకు సంబంధించి 10 మంది అరెస్ట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 170 మందిని ముందస్తు అరెస్ట్ చేశామని, బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోందని ఆయన వివరించారు. 
 
నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. 
 
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్ గ్యాస్ ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. నిన్నటి ఘటనలో అరెస్ట్ అయిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోద చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments