Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చావే చివరిదికావాలి.. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగి బలిదానం

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (16:21 IST)
తెలంగాణా రాష్ట్రంలోని పలువురు నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో నిరుద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. తన చావే చివరిది కావాలంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. 
 
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జబ్బర చెలుక గ్రామానికి చెందిన ఆసంపల్లి మహేష్ (28)... కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకపోవడంతో మనస్తాపం చెంది వెల్మపల్లె గ్రామ సమీపంలోని పత్తి చేనులో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. 
 
నోటిఫికేషన్లు లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. ‘సీఎం కేసీఆర్ మీకు దండం పెడుతా.. ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేయండి. మీ కాళ్లు పట్టుకుంటా. నాలాగా ఎవరూ రాలిపోకూడదు. నిరుద్యోగిగా తన చావే చివరిది కావాలి’ అని మహేష్ తన లేఖలో రాశాడు.
 
కాగా.. నిరుద్యోగి ఆత్మహత్య విషయం తెలుసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని.. పంచనామా నిర్వహించారు. వైద్య సిబ్బందిని కూడా అక్కడికే పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ‎ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లినా గంటల తరబడి జాప్యం చేసే వైద్యులు, పోలీసులు గంటల్లోనే నిరుద్యోగి గ్రామానికి వెళ్లి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కితే ప్రభుత్వ పరువుకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments