Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వర్షాలు ఇప్పట్లో తగ్గబోవు- వాతావరణశాఖ

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:33 IST)
తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆదివారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నదని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు, కొత్త అల్పపీడనం కారణంగా ఏర్పడే పరిస్థితులు కలిసి, మరిన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినా, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాదులో నిత్యమూ ఏదో ఒక సమయంలో భారీ వర్షం కాసేపు పలకరిస్తూనే ఉంది.
 
ఇక రాగల 48 గంటల్లో ఉమ్మడి అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణశాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments