Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా చెల్లెళ్లు ప్రేమించుకున్నారు.. చివరకు ప్రాణాలు తీసుకున్నారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (10:52 IST)
వారిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. కానీ, ప్రేమించుకున్నారు. ఈ విషయం బయటకు తెలిసింది. మంచి పద్దతి కాదంటూ పెద్దలు హెచ్చరించారు. దీంతో తామిద్దరం కలిసివుండటం సాధ్యం కాదనుకున్నారు. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని చేగుంట - కృష్ణ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దానాల, పర్లాపల్లి గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు పత్తి చేలలో పని చేసేందుకు తెలంగాణాలోని చేగుంటకు వలస వచ్చాయి. అక్కడే తాత్కాలిక గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఈరమ్మ - మున్నెల్ల దంపతులకు మణికుమార్ (25) అనే కుమారుడు ఉండగా, శాంతమ్మ - కేశవల కుమార్తె అనిత (15)లు వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. ఈ విషయం వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ వారిద్దరూ గత కొద్దిరోజులుగు ప్రేమించుకుంటున్నారు. 
 
ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. వారు ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. అప్పటి నుంచి వారు ఒకరినొకరు విడిచి ఉండటం సాధ్యం కాదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి సమయంలో వారిద్దరూ కలిసి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత అనిత పట్టాల మధ్య తన చున్నీ పరవగా వారిద్దరూ దానిపై పడుకున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన రైలు ఒకటి వారిపై దూసుకెళ్లడంతో వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments