Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పెన్షన్ దారులకు శుభవార్త.. ఇక నెలవారి పింఛన్ రూ.5 వేలు : సీఎం కేసీఆర్

తెలంగాణాలో పెన్షన్ దారులకు శుభవార్త.. ఇక నెలవారి పింఛన్ రూ.5 వేలు : సీఎం కేసీఆర్
Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (15:08 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్‌దారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల పెన్షన్‌‍ను వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే రూ.5 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత తమదేనన్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాలు, వేరే పార్టీల ఎన్నికల హామీలు, వాటి అమలు తీరుతెన్నులను దృష్టిలో పెట్టుకొని.. అన్నివర్గాలను ఆకర్షించేలా హామీలు ఇచ్చారు. 2014లో మేనిఫెస్టోను ముందుగానే విడుదల చేసిన గులాబీ పార్టీ.. 2018లో మాత్రం ఎన్నికలకు మూడురోజుల ముందే విడుదల చేయగా, ఇపుడు 45 రోజుల ముందే మేనిఫెస్టోను చేస్తున్నట్టు తెలిపారు.
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, ఆసరా పెన్ష‌న్ల‌ను ఈ భ‌వ‌నంలోనే పుట్టిన నిర్ణ‌యం. రెండున్న‌ర గంట‌ల పాటు గ‌తంలో చ‌ర్చించాం. ఆసరా పెన్ష‌న్ల‌కు చాంపియ‌న్ బీఆర్ఎస్ పార్టీ.. ప‌దులు, వంద‌ల రూపాయాల్లో ఉన్న స్కీంను వేల రూపాయాల‌కు తీసుకెళ్లాం. ఆస‌రా పెన్ష‌న్ల‌ను రూ.5 వేల‌కు పెంచుతున్నాం. స‌డెన్‌గా మ‌రుస‌టి రోజే ఇవ్వం. గ‌వ‌ర్న‌మెంట్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ స్కీంలో భాగంగా వ‌చ్చే ఏడాది మార్చి త‌ర్వాత రూ.3 వేలు చేస్తాం. 
 
ఆ తర్వాత ప్ర‌తి ఏడాది రూ.500 పెంచుకుంటూ.. ఐదో సంవ‌త్స‌రం నాటికి రూ.5 వేలు చేస్తాం. దీంతో ప్ర‌భుత్వం మీద భారం ప‌డ‌దు. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్‌లో కూడా ఈ స్కీంను విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నాం. మేం కూడా మ‌రో వెయ్యి పెంచి.. ఏడాదికి పెంచుకుంటూ పోతే రూ.5 వేల‌కు చేరుకుంటుంది. ప్ర‌భుత్వ ఆదాయం పెరుగుత‌ది కాబ‌ట్టి అమలు చేస్తామన్నారు.
 
దివ్యాంగుల పెన్ష‌న్‌ను ఇటీవ‌లే రూ.4 వేలు చేసుకున్నాం. దాన్ని ఆరు వేల రూపాయాల‌కు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల 35 వేల కుటుంబాల్లో దివ్యాంగులు ఉన్నారు. మార్చి త‌ర్వాత రూ.5 వేల‌కు చేస్తాం. ప్ర‌తి సంవ‌త్స‌రం 300 పెంచుకుంటూ.. ఐదో సంవ‌త్స‌రం నాటికి రూ.6 వేలు చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments