Publish Date: Sat, 07 Oct 2023 (12:56 IST)
Updated Date: Sat, 07 Oct 2023 (12:57 IST)
కొద్దిరోజుల క్రితం వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని వివరించారు. దీంతో కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం వుందని తెలిపారు.
వైరల్ జ్వరం బారిన పడిన సీఎం కేసీఆర్ దాదాపు మూడు వారాలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను కేటీఆర్ వెల్లడించారు.