Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రణవీర్ సింగ్‌ను తమ ప్రచారకర్తగా ఎంచుకున్న జాన్సన్ & జాన్సన్

Advertiesment
image
, గురువారం, 5 అక్టోబరు 2023 (21:42 IST)
కంటి ఆరోగ్యంలో గ్లోబల్ లీడర్ మరియు జాన్సన్ & జాన్సన్ మెడ్‌టెక్‌లో భాగమైన జాన్సన్ & జాన్సన్ విజన్, జెన్ జెడ్ మరియు మిలీనియల్స్‌ను కాంటాక్ట్ లెన్స్‌లను ప్రయత్నించమని ప్రోత్సహించడానికి సూపర్ స్టార్ రణవీర్ సింగ్‌తో చేతులు కలిపినట్లు ఈ రోజు వెల్లడించింది. కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి మరియు కొత్త కాంటాక్ట్ లెన్స్ ధరించిన వారిని స్వాగతించడానికి ACUVUE మిషన్‌ను విస్తరించడం ఈ ప్రచారం లక్ష్యం. 
 
గత కొన్ని సంవత్సరాలుగా, ACUVUE భారతదేశంలో కంటి ఆరోగ్య పరివర్తనకు నాయకత్వం వహించింది. భారతీయ వినియోగదారుల అవసరాన్ని అర్థం చేసుకోవడానికి మరియు కాంటాక్ట్ లెన్స్‌ల వినియోగంపై వారి భయాన్ని పోగొట్టడానికి ఈ బ్రాండ్ సమర్థవంతమైన చర్యలను చేపట్టింది. వాస్తవానికి, ఈ విభాగం గురించి అవగాహన పెంచడం ద్వారా వినియోగదారులకు మరియు ఆప్టోమెట్రిస్టుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి మరియు సాధారణ కంటి తనిఖీలకు వెళ్లేలా వినియోగదారులను ప్రోత్సహించడానికి ACUVUE అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
 
వినియోగదారులు కాంటాక్ట్ లెన్స్‌ల గురించి సలహా కోసం నిపుణులను సంప్రదించడానికి బదులుగా తరచుగా తమ తోటివారి వైపు మొగ్గు చూపుతారు. ఈ ప్రచారం వినియోగదారులను ఆప్టోమెట్రిస్ట్‌ను సంప్రదించేలా ప్రయత్నం చేస్తుంది. కాంటాక్ట్ లెన్స్‌లపై సమాచారం కోసం వారు మొదటిగా సంప్రదించాల్సింది వారినే అని వెల్లడించటం తో పాటుగా కంటి ఆరోగ్యం గురించి సులభముగా మరియు అర్థవంతంగా అవగాహన కల్పించాలి. రణ్‌వీర్ సింగ్ ఈ ప్రచారానికి నాయకత్వం వహించడంతో, భారతదేశంలోని యువతతో బలమైన, నిబద్ధత కలిగిన మరియు ఆకర్షణీయమైన సంబంధాన్ని నిర్మించాలని మేము ఆశిస్తున్నాము.
 
జాన్సన్ & జాన్సన్ విజన్, విజన్ కేర్ ఇండియా, బిజినెస్ యూనిట్ డైరెక్టర్, శ్రీమతి టినీ సేన్‌గుప్తా ఈ ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ, “భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్‌ల గురించి అవగాహన కల్పించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని ACUVUE మారుస్తుంది. మార్గదర్శిగానూ నిలుస్తుంది.   ప్రపంచవ్యాప్తంగా #1 విక్రయిస్తున్న కాంటాక్ట్ లెన్స్‌ల బ్రాండ్ కుటుంబంగా ACUVUE గుర్తింపు పొందింది. అయితే భారతదేశంలో ఇప్పటికీ కాంటాక్ట్ లెన్స్ వినియోగం తక్కువగా ఉంది. మేము ACUVUEని భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్ బ్రాండ్‌లో నం.1 ఎంపికగా మార్చే లక్ష్యంతో ఉన్నాము." అని అన్నారు. 
 
ఈ నూతన భాగస్వామ్యం గురించి తన సంతోశాన్ని వ్యక్తం చేసిన సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ, “భారతదేశంలో కంటి ఆరోగ్యం గురించి సంభాషణలను నడిపించే వారి ప్రయాణంలో ACUVUEతో చేరడం చాలా ఆనందంగా ఉంది. కంటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను యువతకు తెలియజేయడానికి ఈ ప్రచారం నాకు తగిన అవకాశం ఇస్తుంది. యువ వినియోగదారులు వారి మొదటి కాంటాక్ట్ లెన్స్ ఫిట్టింగ్ అనుభవం కోసం ఆప్టోమెట్రిస్ట్‌ని సందర్శించడం ద్వారా ఈ ప్రయాణంలో నాతో చేరాలని నేను ఎదురు చూస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరులోని MSR సర్కిల్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం