Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరులోని MSR సర్కిల్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం

jewels
, గురువారం, 5 అక్టోబరు 2023 (20:53 IST)
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ, ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్, చిత్తూరులోని MSR సర్కిల్‌లో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించడంతో, ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈరోజు ప్రకటించింది. ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున 6 అక్టోబర్ 2023 ఉదయం 10:30 గంటలకు సరికొత్త షోరూమ్‌ను ప్రారంభిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ యొక్క 9వ షోరూమ్‌గా నిలువనుంది.  ప్రస్తుతం, ఆభరణాల బ్రాండ్ విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, గుంటూరు మరియు రాష్ట్రంలోని అనేక మార్కెట్‌లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
 
కొత్త షోరూమ్ ప్రారంభం గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉన్న చిత్తూరులో మా ప్రయాణం ప్రారంభిస్తున్నామని వెల్లడిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రారంభంతో, మేము బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్‌ను ఈ ప్రాంతంలోని ఆభరణాల అభిమానులకు  మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. చిత్తూరు అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని, చివరికి వృద్ధి వేగాన్ని పెంచడానికి మాకు సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము. ఈ ప్రాంతంలో వేయబడిన మా బలమైన పునాదులపై ఆధారపడి, కొత్త పెట్టుబడి రాష్ట్రంలో మా కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది..." అని అన్నారు 
 
ఈ ప్రాంతంలో తన రిటైల్ స్టోర్స్- కార్యకలాపాలను విస్తరించే వ్యూహంలో భాగం చిత్తూరులో మా షోరూమ్ ప్రారంభం. ప్రపంచ స్థాయి వాతావరణంలో  కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క ఆభరణాల కలెక్షన్ నుండి విస్తృతమైన డిజైన్లను షోరూంలో ప్రదర్శించడం జరుగుతుంది. షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక ప్రత్యేకమైన ప్రమోషన్‌ను అందిస్తోంది: కనీసం రూ. రూ. 1 లక్ష ఆభరణాలు షాపింగ్ చేసే కస్టమర్‌లకు సగం కొనుగోలు విలువపై 0% మేకింగ్ ఛార్జీలు అందిస్తారు. అదనంగా, కళ్యాణ్ స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేట్- మార్కెట్‌లో అత్యల్పమైనది, అన్ని కంపెనీ షోరూమ్‌లలో ప్రామాణికమైనది కూడా వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లు పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినులకు సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్