Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవీ శ్రీ ప్రసాద్ ప్రతిభ చూస్తే ముచ్చటేస్తుంది, నాగార్జున

Advertiesment
Devi Sri Prasad, Nagarjuna
Devi Sri Prasad, Nagarjuna
టీ సీరిస్ అధినే భూషణ్ కుమార్.. మన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను సరికొత్తగా చూపించేశారు. ఓ పరి అంటూ ప్రైవేట్ ఆల్బమ్‌ను హిందీలో రిలీజ్ చేశారు. ఈ పాటను రణ్‌వీర్ సింగ్ విడుదల చేయగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ పాటను తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో కింగ్ నాగార్జున ఈ పాటను రిలీజ్ చేశారు. తమిళంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ బిగ్ బాస్ స్టేజ్ మీద దేవీ శ్రీ ప్రసాద్ చేసిన ఈ పాటను రిలీజ్ చేసి అభినందించారు.
 
అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. 'దేవీ శ్రీ ప్రసాద్ రాసి, పాడి, కంపోజ్ చేసిన ఓ పరి పాట హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు. మన తెలుగు వారికి కూడా ఆ పాట కచ్చితంగా నచ్చుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ ప్రతిభను చూస్తే నాకు ముచ్చటేస్తుంటుంది. ఇంత మంచి పాటను కంపోజ్ చేసినందుకు దేవీ శ్రీ ప్రసాద్‌కు కంగ్రాట్స్' అని అన్నారు.
 
ఈ సంద‌ర్భంగా దేవిశ్రీప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నాగార్జున సర్, కమల్ హాసన్ సర్‌లకు థాంక్స్. నా ఈ కష్టంలో వారి సాయం ఎంతో విలువైంది. ఇంటర్నేషనల్ సాంగ్ చేయాలనే నా ఆలోచనను ముందు కమల్ హాసన్ సర్‌తోనే పంచుకున్నాను. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలతోనే ఈ పాటను పూర్తి చేయగలిగాను. ఆయనకు సంగీతం మీదున్న మక్కువ, నాలెడ్జ్ వల్లే మేం ఇద్దరం ఇంత సన్నిహితంగా మారిపోయాం. అందుకే ఈ పాటను ఆయనే రిలీజ్ చేయాలని నేను కోరుకున్నాను" అని అన్నారు.
 
 ‘ఓపరి’ పాటకు హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, కమల్ హాసన్ వంటి వారు తెలుగు తమిళ భాషల్లో ఈ పాటను రిలీజ్ చేయడంతో మరింత మందికి రీచ్ అయి అద్భుతమైన స్పందన లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద‌ర్శ‌కుడు బాబీ పూజ‌తో మెగా 154 డ‌బ్బింగ్ మొద‌లైంది