Devisree Prasad, Ranveer Singh
భూషణ్ కుమార్ నాన్ ఫిల్మ్ హిందీ సాంగ్ ఓ పరి ద్వారా ఈసారి అద్భుతమైన ప్రతిభావంతుడు సౌత్‌కు చెందిన గొప్ప టెక్నీషియన్ డి.ఎస్.పి అలియాస్ దేవిశ్రీ ప్రసాద్‌ను మన ముందుకు సరికొత్తగా తీసుకొచ్చారు. రీసెంట్‌గా ఆ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దేవిశ్రీప్రసాద్. ఈ పాటను ప్రీమియర్ చేయటమే కాకుండా, ఓ పరి సాంగ్‌లో సిగ్నేచర్ స్టెప్‌తో స్టేజ్‌పై దుమ్మ రేపారు. వారిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ వేదికనే కాదు.. ఆ ప్రాంగణాన్నే ఊపేసింది. డిఎస్‌పి హుక్ స్టెప్‌తో ఆకట్టుకోగా, రణ్‌వీర్ సింగ్ పాటను పాడి మెప్పించారు.
ఓ పరి సాంగ్ ఓ ట్రాక్ మాత్రమే కాదు.. మ్యూజిక్ మ్యాస్ట్రో భూషణ్ కుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మధ్య ఇదొక మెగా కొలాబ్రేషన్. త్వరలోనే ఈ పాటను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. డిఎస్‌పి చేసిన తొలి నాన్ ఫిల్మ్ హిందీ సాంగ్ ఓపరి.. దీంతో ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ తెలియని ఆసక్తి క్రియేట్ అయ్యింది.
ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ నాన్ ఫిల్మ్ హిందీ మ్యూజిక్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అలాంటి నాకు భూషణ్ కుమార్ కంటే గొప్ప కొలబ్రేషన్ ఎవరుంటారు. చాలా హార్డ్ వర్క్, ప్యాషన్, ప్రేమతో చేసిన సాంగ్ ఓపరి. ఈ సాంగ్‌తో ఇది వరకంటే ఎక్కువ ప్రేమను ఆడియెన్స్ నాపై చూపిస్తారని భావిస్తున్నాను. అలాగే రణ్‌వీర్ సింగ్ కూడా చాలా గొప్ప వ్యక్తిత్వమున్నవాడు. మా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తను అందించిన సపోర్ట్‌కి నేను తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీని కంటే ఎగ్జయింట్ ప్రాజెక్ట్స్‌తో భవిష్యత్తులో ప్రేక్షకులను మెప్పిస్తానని తెలియజేసుకుంటున్నాను. నా అమ్మగారు తొలిసారి ఈ సాంగ్ రిలీజ్ కోసం ముంబైకి వచ్చారు. నా ఫస్ట్ మ్యూజిక్ వీడియోను మా అమ్మగారి సమక్షంలో విడుదల చేయాలని కలగన్నాను అన్నారు. స్టేజ్ పైకి డిఎస్‌పి తన తల్లిని పిలిచి అందరికీ పరిచయం చేశారు.
రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ రాక్‌స్టార్ డిఎస్‌పి సాంగ్‌ను విడుదల చేయటాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదొక గొప్ప అనుభూతి. ఆ అనుభూతి ఈ మ్యూజిక్‌లోనూ కనిపిస్తంఓది. ఈ సాంగ్‌లోని హుక్ స్టెప్ నాకు బాగా నచ్చింది. బీట్ కూడా చాలా క్యాచీగా, అద్బుతంగా ఉంది అన్నారు.
భూషణ్ కుమార్ మాట్లాడుతూ డిఎస్‌పి నిజమైన ప్రతి విషయంలోనూ నిజమైన రాక్‌స్టార్. ఆయన సంగీతాన్ని ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాన్ ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అతను ప్రవేశించడానికి ఇదే సరైన సమయంగా నాకు అనిపిస్తుంది. అతనితో కలిసి పనిచేయటం మరచిపోలేని అనుభూతి. ఓపరి సాంగ్ వినగానే ప్రేక్షకులకు నచ్చేస్తుంది. ఇలాంటి సింగిల్ ట్రాక్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ రావటమనేది ఇండియన్ మ్యూజిక్ రంగానికి గొప్ప సమయంగా చెప్పొచ్చు. అలాంటి థండర్ రెస్పాన్స్ ఈ పాటకు వస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు.
ఈ పెప్పీ సింగిల్ విన్నప్పుడు దాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరినీ మనం గుర్తిస్తాం. ఇప్పుడు విడుదలైన పాటతో, ఈ ట్రాక్ స్మాష్ హిట్ కంటే ఇది తక్కువ కాదని మేం గట్టిగా చెప్పగలం. మీ ప్లే లిస్టులోని పాటలన్నింటిలో మించేలా ఓపరి సాంగ్ ఉంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేసిన తొలి హిందీ పాట ఓపరిని టీ సిరీస్ యూ ట్యూబ్ ఛానెల్‌లో గమనించవచ్చు.