Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3డిలో రూపొందుతోన్న సూర్య 42 మోషన్ పోస్టర్ - దిశాప‌టాని హీరోయిన్‌

Advertiesment
Surya 42 motion poster
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:01 IST)
Surya 42 motion poster
యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను ఇన్ స్పైర్ చేసేలా సౌత్ స్టార్ సూర్య కొత్త సినిమా సూర్య 42 మోషన్ పోస్టర్ వచ్చేసింది. కేఈ జ్ఞానవేల్ రాజా సగర్వ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మైటీ వైలెంట్ సాగాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ పోస్టర్ లోని గ్రాండియర్ చూస్తుంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రానుందని తెలుస్తోంది. సూర్య లుక్, అద్భుమైన మూవీ డిజైనింగ్, అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్ తో సూర్య 42 ఫరెవర్ స్పెషల్ మూవీ కాబోతోంది. చిత్ర నిర్మాణంలో కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ అభిరుచిని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రదర్శించాయి.
 
webdunia
Surya 42 motion poster
ఆగస్టు 8న ప్రారంభమైన ఈ సినిమా అదే రోజు రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. కాగా, అనుకున్న‌ట్లుగా ఈరోజు శ‌క్ర‌వారంనాడు సూర్య‌42 పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. 3డి ఫార్మెట్‌లో కూడా ఈ చిత్రం రూపొంద‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ చిత్రాన్ని 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిశా పటానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రెడిన్ కింగ్స్లే, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
సూర్య అభిమానులకు 2022 బెస్ట్ ఇయర్ గా నిలిచిపోతుంది. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా సురరై పొట్రుకు అవార్డ్ దక్కడం, ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా సెలెక్ట్ అవడం, విక్రమ్ లో రోలెక్స్ గా మెరవడం..ఇవన్నీ ఫ్యాన్స్ ను ఖుషి చేశాయి. ఇప్పుడీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అభిమానుల ఉత్సాహం మరింత పెరుగుతోంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిసామి, ఆర్ట్ - మిలన్, ఎడిటర్ - నిషాద్ యూసుఫ్, స్టంట్స్ - సుప్రీం సుందర్, మాటలు - మదన్ కార్కీ, కొరియోగ్రఫీ - శోభి, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్స్ - స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, నిర్మాతలు - కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ - ప్రమోద్, దర్శకత్వం - శివ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ తర్వాత ఆ హీరోనే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. పీకే ఫ్యాన్స్ ఫైర్