Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైభవంలేని రంగ రంగా - రివ్యూ రిపోర్ట్‌

Ranga Ranga ph
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:04 IST)
Ranga Ranga ph
నటీనటులు: వైష్ణవ్ తేజ్-కేతిక శర్మ-నవీన్ చంద్ర-నరేష్-ప్రభు-సుబ్బరాజు-సత్య-ప్రగతి-తులసి తదితరులు
సాంకేతిక‌త‌- ఛాయాగ్రహణం: శ్యామ్ దత్ సైనుద్దీన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్,  రచన-దర్శకత్వం: గిరీశాయ
 
క‌రోనా త‌ర్వాత సినిమా క‌థ‌ల‌న్నీ మారాలి. కంటెంట్ కూడా చూసుకోవాలి. లేదంటే నా సినిమా ప‌రిస్థితిలాగే అవుతుంద‌ని `ఆచార్య‌` సినిమా గురించి ఆల‌స్యంగానైనా నిజాన్ని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి మాట‌లు ఇక్క‌డ గుర్తు చేసుకోవాలి. ఉప్పెన‌తో ఊహించ‌ని స‌క్సెస్‌ను పొందిన హీరో వైష్ణ‌వ్ తేజ్ రెండో సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్‌తో `'కొండపొలంస చేశాడు. కానీ అదీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఇవ్వ‌లేక‌పోయింది. ముచ్చ‌ట‌గా మూడో సినిమాగా అచ్చ‌మైన తెలుగు టైటిల్‌తో   'రంగ రంగ వైభవంగా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో గిరీశయ్య తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజున విడుద‌ల‌వుతుంది అంద‌రూ చూసి ఎంజాయ్ చేయండంటి చిత్ర యూనిట్ చెప్పింది. మ‌రి అదెలా వుందో చూద్దాం.
 
కథ:
 
చిన్న‌ప్ప‌టినుంచి ప్ర‌భు, సీనియ‌ర్ స‌రేష్ స్నేహితులు. ప‌క్క‌ప‌క్క‌నే నివాసం. రిషి (వైష్ణవ్ తేజ్) న‌రేష్ కొడుకు. రాధ (కేతిక శర్మ) ప్ర‌భు కుమార్తె. ఇద్ద‌రూ చిన్న‌ప్పుడు ఒకే తేదీన పుడ‌తాడు. పెరిగి పెద్ద‌య్యాక ఒకేచోట‌చ‌దువు. డాక్ట‌ర్ కోర్సు చేస్తారు. ఇద్ద‌రి మ‌ధ్య చిలిపి త‌గాదాలు ప్రేమ‌గా మారి ఓ ద‌శ‌లో ఇగోకు దారితీసి మాట్లాడుకోవ‌డం మానేస్తారు. రాధ అన్న న‌వీన్ చంద్ర పొలిటిక‌ల్ లీడ‌ర్ అవ్వాల‌నుకుంటాడు. ఓ సంద‌ర్భంలో త‌న రెండో సోదిరిని న‌వీన్ చంద్ర త‌న స్నేహితుడికిచ్చి పెండ్లిచేయాల‌ని పెండ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు. త‌న‌కు ఈ పెండ్లి ఇష్టంలేద‌ని తాను రిషి అన్న‌ను ప్రేమిస్తున్నాన‌ని తేల్చిచెబుతుంది. ఆ త‌ర్వాత న‌వీన్‌చంద్ర ఇగో వ‌ల్ల ఇరు కుటుంబాల మ‌ధ్య స్ప‌ర్థ‌లు వ‌స్తాయి. ఆ త‌ర్వాత రిషి, రాధ క‌లిసి ఏవిధంగా అంద‌రినీ ఒక‌టి చేశార‌నేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఇటువంటి క‌థ‌లు తెలుగులో చాలానే వ‌చ్చాయి. కేవ‌లం రెండు కుటుంబాల క‌థ‌ను తీసుకుని రెండుగంట‌లు సినిమా తీయాల‌నుకోవ‌డం సాహ‌స‌మే. గిరీశయ్య అనే కొత్త‌ద‌ర్శ‌కుడు వైష్ణ‌వ్‌తేజ్‌ను ఎలా ఒప్పించాడ‌నేది ఆశ్చ‌ర్యంగా వుంటుంది. క‌థ‌లో ఎక్క‌డా హీరోయిజం క‌నిపించ‌దు. ద‌ర్శ‌కుడు త‌న‌కిష్టం వ‌చ్చిన‌ట్లు స‌న్నివేశాలు రాసుకున్న‌ట్లు తెలిసిపోతుంది. త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతుంది. అనేది క్లారిటీ ప్రేక్ష‌కుల‌కు క‌నిపించ‌డం విశేషం.
 
ఇరుకుటుంబాలు విడిపోయాక‌.. క‌లిసిమెలిసి వుంటేనే  కలదు సుఖం అని కార్తీక‌దీపం సీరియ‌ల్‌లోని డాక్టర్ బాబు చిన్న స్పీచ్ ఇవ్వగానే వాళ్లలో రియలైజేషన్ వచ్చేస్తుంది. హీరో హీరోయిన్లు ఫుల్ హ్యాపీ. ఇలాంటి సీన్లు రైటింగ్... ఎడిటింగ్ టేబుళ్లను దాటి తెరమీదికి వచ్చేశాయంటే.. ఇది ఏ స్థాయి సినిమాను అర్థం చేసుకోవచ్చు.
 
-  ఆరంభం నుంచి చివరిదాకా పరమ రొటీన్ అనిపిస్తూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ సాగ సినిమా ఇది. హీరో హీరోయిన్లు చిన్న ఇగో క్లాష్ వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోరు.. కానీ వారి మధ్య ప్రేమ మాత్రం ఉంటుంది.. ఈ పాయింట్ ట్రైలర్ కట్ చేసుకోవడానికి బాగానే పనికొచ్చింది. కానీ మొత్తంగా సినిమా అంతా చూపించాల‌నుకోవ‌డం పొర‌పాటే. ప‌లు స‌న్నివేశాల్లో చిరంజీవి, ప‌వ‌న్ ఖ‌ళ్యాణ్ సినిమాల స‌న్నివేశాలు పెట్టేసి ర‌క్తిక‌ట్టించాల‌ని చూసిన ప్ర‌య‌త్నం వృధాగానే మారింది. 
 
- ఓ ద‌శ‌లో ప్రగతి-తులసిలు చీర‌ల విష‌యంలో గొడ‌వ‌ప‌డి.. ఫ‌లాన ఫంక్ష‌న్ నాడు పెట్టిన ద‌రిద్ర‌మైన చీర నువ్వే వుంచుకో అంటూ.. ద‌ర్శ‌కుడు వారిచేత డైలాగ్‌లు చెప్పిస్తాడు. ఇలాంటి  డైలాగ్‌లు మ‌రికొన్ని వున్నాయి. న‌వీన్‌చంద్ర ఓ పార్టీకి యూత్ లీడర్ కావాల‌నుకోవ‌డం, అత‌ని అపోజిట్‌గా సుబ్బ‌రాజు కావాల‌నుకోవ‌డం.. వీరి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పార్టీ మీటింగ్‌లు అన్నీ ప‌ర‌మ చెత్త‌గా వున్నాయి.  దాంతో అంతకంతకూ 'రంగ రంగ వైభవంగా' గ్రాఫ్ పడిపోతూ వెళ్తుందే తప్ప ఏ దశలోనూ పైకి లేవదు. ముగింపు కూడా పేలవంగా వుంది.
 
శుభం కార్డ్ వేశాక టైటిల్‌సాంగ్ రావ‌డం విడ్డూరంగా వుంది. దాన్ని చూసి ఆస్వాదించేందుకు ప్రేక్ష‌కుడు కూడా లేక‌పోవ‌డంతో దాదాపు 40 ల‌క్ష‌లు ఆ సాంగ్ కోసం వెచ్చించింది బూదిద‌లోపోసిన ప‌న్నీరే అనిపిస్తుంది. తొలి సన్నివేశం దగ్గర్నుంచి రొటీన్ అనిపించే ఈ సినిమా ఏ దశలోనూ ప్రేక్షకులను మెప్పించ‌దు. రంగ‌రంగా.. ఇదేమిరా.. అనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీరియల్ నటి ప్రేమలో హైపర్ ఆది?