పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని కనిపించనున్న సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉందని చెబుతున్నారంతా. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండర్డ్స్‌లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. గత వారం రోజులుగా మా హీరో రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించాం. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తాం. త్వరలో మిగతా పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆల్రెడీ విడుదలైన 'బుల్లెట్...' సాంగ్ అందరి నోట వినబడుతోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో రామ్, కృతి శెట్టి వేసిన స్టెప్స్ వేస్తూ యంగ్‌స్టర్స్ రీల్స్ చేస్తున్నారు. పోస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పాటకు 55 మిలియన్ వ్యూస్ రావడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి.