Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల సమయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు : పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

kcr
, ఆదివారం, 15 అక్టోబరు 2023 (14:50 IST)
ఎన్నికల సమయంలో పిచ్చి పిచ్చి వేషాలు, చిలిపి చేష్టలు చేయొద్ని పార్టీ నేతలకు భారసా అధినేత, సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన  పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గా ఇన్‌ఛార్జులతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. 
 
పార్టీ కార్యకర్తలతో సామరస్యపూర్వకంగా మెదలాలని సూచించారు. తలబిరుసుతనంతో వ్యవహరిస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు. గతంలో అహంకారం ప్రదర్శించడం వల్లే జూపల్లి ఓటమి పాలయ్యారని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. అలకలు పక్కన పెట్టి అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. 
 
ఈ ఎన్నికల ప్రచారానికి సోమ భరత్ కుమార్‌ను సమన్వయకర్తగా నియమించినట్లు కేసీఆర్ చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే 98480 23175 నంబర్‌కు ఫోన్ చేయాలని.. భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారని అభ్యర్థులకు సూచించారు. జూపల్లి కృష్ణారావు ఉదంతాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జూపల్లి కృష్ణారావు అని ఒకాయన ఉండే.. మంత్రిగా కూడా పని చేశారు. అయినా అహంకారంతో వ్యవహరించారు. ఇతర నాయకులతో మాట్లాడలేదు. దీంతో 2018 ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. హుస్నాబాద్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు సీఎం కేసీఆర్ కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ బస్సును అందించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బస్సు ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకుంది. ఆదివారం జరగనున్న హుస్నాబాద్ ప్రచార సభలో ఈ బస్సును కేసీఆర్ ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఈ ప్రచార రథం హుస్నాబాద్‌కు పయనమైనట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అరెస్టులో వైకాపా - బీజేపీ కుట్ర : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి