తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తేబోయే మేనిఫెస్టోలో ఉచిత పథకాలు అంతగా ఉండవు అని తెలుస్తోంది. కమలం మేనిఫెస్టోలో 7 ప్రధాన హామీలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ మేనిఫెస్టోకి కాషాయదళం, ఇంద్రధనస్సు అనే పేరు పెట్టడంతో, 7 పథకాల ప్రచారం ఊపందుకుంది.
ఉచిత విద్య , వైద్యం, యువతకు స్వయం ఉపాధి, సబ్సిడీ రుణాలు, రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం, ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లు, పీఎం యోజన కింద ఇళ్లు, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి వున్నాయి. ముసలివారు, వితంతువులు, ఒంటరి మహిళలకు, BRS, కాంగ్రెస్ కంటే రూ.1000 అదనంగా పింఛన్లు అందించేటువంటివి మేనిఫెస్టోలో వున్నాయి.