Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌కు చేరుకున్న "ఆపరేషన్ అజయ్" 2వ విమానం

Advertiesment
Operation Ajay
, శనివారం, 14 అక్టోబరు 2023 (12:43 IST)
Operation Ajay
ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం మరో విమానం 235 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకుంది. భారత ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ చార్టెడ్ విమానాలను ఏర్పాటు చేసింది. 
 
ఈ విమానాల్లో భారత్ రావాలనుకునే వారు ముందుగా తన పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికే ప్రయాణం కల్పించేలా భారత్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఈ ఫ్లైట్స్ నిర్వహిస్తోంది. 
 
కాగా, ఆదివారం కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. తమను సురక్షితంగా తరలిస్తున్న భారత్‌కు ఎన్నారైలు ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజిటల్‌ మీటర్‌ వద్దు.. 95 మంది ఎత్తు మాన్యువల్‌గా కొలవండి