హమాస్ కిడ్నాప్ చేసి నగ్నంగా ఊరేగించిన 22 ఏళ్ల జర్మన్ మహిళ షానీ లౌక్ బతికే ఉందని ఆమె తల్లి రికార్డా లౌక్ తెలిపారు. తన కూతురు బతికే ఉందని పాలస్తీనా వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని రికార్డా లౌక్ వెల్లడించారు. తన కుమార్తె భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శని లౌక్ క్షేమంగా తిరిగి రావడానికి ఏర్పాట్లు చేయాలని జర్మనీ ప్రభుత్వాన్ని కోరింది.
షానీ లౌక్ తలకు బలమైన గాయమైందని, తన పరిస్థితి విషమంగా ఉందని ఆమె తల్లి కన్నీరుమున్నీరైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్షణం విలువైనదే. కాబట్టి జర్మనీ ప్రభుత్వం త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని వీడియోలో అభ్యర్థించింది.
టాటూ ఆర్టిస్ట్ షానీని హమాస్ యోధులు శనివారం కిడ్నాప్ చేశారు. ఆమెను ట్రక్కు వెనుక ఉంచి, నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన వారిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 150 మందికి పైగా మరణించారు.