ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం మొదలైనట్టేనని తెలుస్తోంది. ఇజ్రాయేల్‌లోకి హమాస్ రాకెట్ దాడి కారణంగా గాజా సరిహద్దు సమీపంలో రోడ్లన్నీ మూసివేయబడ్డాయి. పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ మీద సుమారు 5000 రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్ ప్రారంభించింది. హమాస్ దాడిలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు.
మృతుల్లో షార్ హనెగెవ్ రీజియన్ మేయర్ కూడా ఉన్నారు. శనివారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లను ప్రయోగించారు. గాజా స్ట్రిప్‌లో ప్రతీకార వైమానిక దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్రమైన తప్పు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు.