Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊర్వశివో రాక్షసివో నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట విడుదల

Advertiesment
sireish-anu
, సోమవారం, 10 అక్టోబరు 2022 (16:11 IST)
sireish-anu
కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం "ఉర్వశివో రాక్షసివో" ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్ గా నటించింది.
 
ఇదివరకే రిలీజ్ చేసిన  "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.ఇందులో భాగంగా నేడు "ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుండి "దీంతననా" అనే మొదటి పాటను రిలీజ్ చేసారు చిత్రబృందం. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. పూర్ణచారి సాహిత్యం అందించారు.
"నీ అడుగుల వెంట, నే గురుతై ఉంటా
నీ పాదమే దాటు ప్రతిచోటునా
నీ పెదవులు తాకే  నా పేరును వింటా
ఓ స్పర్శ కే పొంగిపోతానట
కాలం కలిపింది ఈ జోడి బాగుందని"
అనే లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ చేసిన ఈ పాటలో శిరీష్,అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అలానే సిద్ శ్రీరామ్ హిట్ లిస్ట్ మరో క్లాసి మెలోడీ యాడ్ అయింది అని చెప్పొచ్చు.ఈ చిత్రానికి అచ్చు రాజమణి  సంగీతం అందిస్తున్నారు.
 
"ఊర్వశివో రాక్షసివో" చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప-2లో ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా?