Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌రికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసిన సర్కారు వారి పాట లోని క‌ళావ‌తి సాంగ్‌

Advertiesment
స‌రికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసిన  సర్కారు వారి పాట లోని క‌ళావ‌తి సాంగ్‌
, మంగళవారం, 22 మార్చి 2022 (16:56 IST)
100 milions song
సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `సర్కారు వారి పాట`లోని `కళావతి` పాటలో ప్రేమ,  చ‌క్క‌టి భావోద్వేగం క‌లిగివున్నాయి. అందుకే విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి శ్రోత‌ల‌ హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఈ బ్లాక్‌బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్‌లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. ఫాసెస్ట్‌గా మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే మైలురాయిని చేరుకున్న మొదటి సింగిల్‌గా నిల‌వ‌డం విశేషం.
 
S థమన్ అద్భుతమైన ఆర్‌కె.స్ట్రాతో చ‌క్క‌టి ఫీల్‌ను క‌లిగించేలా బాణీలు స‌మ‌కూర్చాడు. సిద్ శ్రీరామ్ తన మ‌ధుర‌మైన‌ గానంతో పాట‌కు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం స‌మ‌కూర్చారు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్,  ఆక‌ట్టుకునే హావ‌భావాల‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు, కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపించింది.
 
ఈ చిత్రం నుంచి వ‌చ్చిన‌ రెండవ సింగిల్ `పెన్నీ` కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. సితార ఘట్టమనేని నటించిన ఈ పాట వైరల్‌గా మారింది. థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ అందించారు. మొదటి రెండు పాటలు విజయం సాధించడంతో సినిమా తదుపరి పాటలపై ఆసక్తి పెరిగింది.
 
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట,  గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్ట‌ర్.
 
ఈ సర్కారు వారి పాట మే 12న వేసవి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా కొత్త చిత్రం ప్రారంభం