సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబు, సితార కలిసి నటించిన `పెన్నీ` సాంగ్‌కు సోషల్‌మీడియాలో 10 మిలియన్స్ కి పైగా భారీ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతుంది. దీనిని చిత్ర యూనిట్ ఆనందంతో సోమవారంనాడు వెల్లడించారు. ఈ పాటలో సితారతోపాటు సంగీత దర్శకుడు థమన్ కూడా డాన్స్ వేయడం, థీమ్‌కు అనుగునంగా మూవ్‌మెంట్‌లు ఇవ్వడం ఆకర్షణీయంగా నిలిచాయి. సితార హావభావాలకు మహేస్ అభిమానులు ఫిదా అయిపోయారు. చాలా నేచురల్‌గా చేసేసింది.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 12న భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.