Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు కావాలా? నేను కావాలా? తేల్చుకో అంది: శృంగారం చేస్తూ దిండుతో అదిమి చంపేశాడు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (19:59 IST)
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని జిన్నారం మండలం గుమ్మడిదల గ్రామంలో నివాసముండే బాషమ్మ ఒంటరి మహిళ. పెళ్ళయి పది సంవత్సరాలవుతోంది. పిల్లలు లేరు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కావాల్సినంత ఆస్తిపరురాలు. పుట్టింటి వాళ్ళు లేకపోవడంతో మెట్టినింట్లోనే ఆమె ఒంటరిగా ఉంటోంది.
 
బంధువుల ఇళ్ళకు అప్పుడప్పుడు వెళ్ళడం.. మళ్ళీ ఇంటికి వచ్చేయడం. ఈ నేపథ్యంలో గత మూడు నెలల నుంచి తనకు బాగా పరిచయమైన గణేష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చదువుకుని ఖాళీగా ఉన్న గణేష్ బాషమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేవాడు.
 
దీంతో ఆమె అతడిని బాగా నమ్మింది. ఆమె నుంచి ఖర్చుల కోసం డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా స్నేహితులతో షికార్లు చేయడమే కాదు తన ప్రియురాలు స్వప్నకు కావాల్సినవన్నీ కొనిచ్చాడు. ఇలా బాగానే సాగింది. అయితే తనతో సంబంధం సాగిస్తున్న గణేష్‌కి ప్రియురాలు స్వప్న ఉన్న విషయం బాషమ్మకు తెలిసింది.
 
తనను తప్ప వేరే వాళ్ళని చూడకూడదని షరతు పెట్టింది. అలా వెళితే తను ఇచ్చిన డబ్బులు మొత్తాన్ని ఇచ్చేయమని గణేష్ పైన ఒత్తిడి తెచ్చింది. దీంతో విషయాన్ని స్వప్నకు చెప్పాడు గణేష్. బాషమ్మను చంపేయమని స్వప్న ఐడియా ఇచ్చింది. రెండురోజుల క్రితం ఆమెతో శృంగారం చేస్తూ ఆ తరువాత ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి వెళ్ళిపోయాడు.
 
గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇస్తే పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. నిందితుడు గణేష్ హత్య చేసిన తరువాత ప్రియురాలు స్వప్న ఇంటి మిద్దె మేడపై దాక్కుని ఉన్నాడు. దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments