Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలో నిన్ను పెళ్లాడతా, దుస్తులు తీసేసి నిలబడమన్న కామాంధుడు

Advertiesment
త్వరలో నిన్ను పెళ్లాడతా, దుస్తులు తీసేసి నిలబడమన్న కామాంధుడు
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (23:15 IST)
18 యేళ్ళ యువతి. లోక జ్ఞానం పెద్దగా తెలియని అమాయకురాలు. ఎవరు ఏది చెప్పినా నమ్మేసే తత్వం. అదే  ఆమె పాలిట శాపంగా మారింది. ఇంటర్ చదువుతున్న ఆ యువతి ఒక మాయగాడి వలలో పడింది. ప్రేమ పేరుతో నాలుగు నెలల పాటు ఆమెతో పిచ్చాపాటీ మాట్లాడిన యువకుడు బాగా నమ్మించాడు. నగ్నంగా నిన్ను చూడాలంటూ వీడియో కాల్ చేయమని ప్రాథేయపడి చివరకు ఆ యువతిని నగ్నంగా చూశాడు.
 
నమ్మక్కల్ జిల్లా రాశీపురం సమీపంలోని రమ్యకు కుమార్తె, కుమారుడు ఉన్నాడు. అనారోగ్యం కారణంగా సంవత్సరం క్రితమే భర్త చనిపోయాడు. ఇంటర్ చదువుతున్న రమ్య కుమార్తె కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులను ఫోన్ లోనే వింటోంది. దీంతో ఒక స్మార్ట్ ఫోన్‌ను తల్లి తీసిచ్చింది.
 
ఉదయం ఇంటి నుంచి రమ్యతో పాటు కుమారుడు వెళితే సాయంత్రానికి కానీ ఇంటికి రారు. ఇద్దరూ పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్నారు. దీంతో రమ్య కుమార్తె ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఆన్లైన్ క్లాసులు తరువాత ఇన్‌స్టాగ్రాం చూడడం ప్రారంభించింది ఆ యువతి.
 
ఇలా అందులో విరుదనగర్‌కు చెందిన తమిళ సెల్వన్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త వీడియో కాల్ చేసుకునేంత వరకు వెళ్ళింది. రెండురోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నువ్వు నగ్నంగా నిలబడవా అంటూ ప్రాథేయపడ్డాడు తమిళ సెల్వన్. 
 
నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నువ్వు నా భార్యవు కదా. అయినా వీడియో కాల్‌లో నగ్నంగా నిలబడితే నీకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా అని చెప్పాడు. ఆ యువతి వద్దని వారించినా ఒప్పుకోకుండా ఆమెను బలవంతం చేసి మరీ ఫోన్ ముందు నగ్నంగా నిలబడేట్లు చేసాడు.
 
ఆ తరువాత ఆ ఫోటోలు, వీడియోలను యువతి తల్లికే పంపించాడు. అంతటితో ఆగలేదు. రమ్యను కూడా నగ్నంగా ఫోన్ ముందు నిలబడమన్నాడు. దీంతో రమ్య తన కుమారుడిని వెంట పెట్టుకుని నేరుగా ఎస్పీని కలిసింది. వెంటనే స్పందించిన ఎస్పీ నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లోని చిరు వ్యాపార సంస్థలకు శక్తిని బలోపేతం చేసిన ఉడాన్‌