నగరంలో ఎవరు పనుల్లో వాళ్లు బిజీగా వుంటారు. పక్క ఇంట్లో పెద్దపెద్ద శబ్దాలను కూడా పట్టించుకునే పరిస్థితి వుండదు. టీవీలు, సెల్ ఫోన్లను చూస్తూ అదే లోకంలో వుంటుంటారు. ఇప్పుడిలాంటి పరిస్థితే దొంగలకు తమ పని సుళువయ్యేందుకు సహకరిస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే... హైదరాబాదులోని వనస్థలిపురం పరిధిలోని గౌతమి నగర్లో 30 ఏళ్ల ఉమాదేవి అనే మహిళ ఇంట్లో వంటరిగా వుంది. ఆ సమయంలో 22 ఏళ్ల యువకుడు తమకు ఇల్లు అద్దెకి కావాలంటూ వచ్చాడు. మాటల్లో పెట్టి ఆమె ఒక్కతే వున్నదని గమనించి, కత్తి బయటకు తీసి బెదిరించాడు.
ఆమె మెడలో వున్న రెండున్నర తులాల బంగారు తాళిబొట్టును తెంపేశాడు. దానితో పాటు ఆమె చేతిలో వున్న సెల్ ఫోనును కూడా తీసుకుని ఉడాయించాడు. చుట్టుపక్కలవారు గమనించేలోపే అతడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది.