Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయి నెలరోజులు.. భార్యను పుట్టింట్లో వదిలి ప్రియురాలితో ఎంజాయ్.. చివరికి?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (18:21 IST)
సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం. లక్షల రూపాయల జీతం. ఇంకేముంది అబ్బాయి మంచోడని నమ్మి కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేశారు తల్లిదండ్రులు. కానీ ఆ ఆశ మొత్తం నెలరోజుల్లోనే ఆవిరైపోయింది. కుమార్తెను అల్లుడు మోసం చేయడమే కాకుండా తను నిలువుగా పోసపోయి చివరకు ప్రాణాలను కోల్పోయాడు. 
 
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఏరియా అది. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు. అమెరికా బేస్డ్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. జనగాంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు రాంకుమార్. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరం నుంచి ఇక్కడే ఉద్యోగం. 
 
మంచి జీతం వస్తుండటంతో జనగాంకు చెందిన రాజేష్ తన కుమార్తె రేవతిని ఇచ్చి వివాహం చేశారు. నెల రోజులైంది వివాహమై. అయితే ఉద్యోగరీత్యా ఆమెను తన పుట్టింట్లోనే ఉంచి హైదరాబాద్‌కు వచ్చేశాడు రాంకుమార్. అయితే ఇక్కడే అతని జీవితం పూర్తిగా మలుపు తిరిగి పోయింది.
 
తనతో పాటు పనిచేసే యువతి రాంకుమార్‌కు ప్రేమ పేరుతో దగ్గరైంది. వారంరోజుల పాటు రాంకుమార్‌కు శారీరకంగా దగ్గరైంది. దీంతో ఆమెను నమ్మాడు రాంకుమార్. అంతేకాదు ఆమె అడిగిన దాన్ని కొనిచ్చాడు. తనపై జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్‌ను ఆమెకు రాసిచ్చేశాడు. అయితే ఆ తరువాత ఆమె నిజస్వరూపం తెలిసింది. ఆ యువతి యువకులను ప్రేమ పేరుతో మోసం చేసి ఆస్తి రాసుకుంటుందని తెలుసుకున్నాడు. కుమిలిపోయాడు. ఎవరికీ చెప్పకుండా జనగాంకు వెళ్ళి భార్య ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. మాయలేడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాంకుమార్ భార్య మాత్రం పెళ్లయిన నెలరోజులకే దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments