Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు కోసం కన్నబిడ్డనే కడతేర్చాడు.. ప్రేమకు వద్దన్నాడు.. ఒప్పుకోకపోవడంతో?

Webdunia
శనివారం, 28 మే 2022 (11:34 IST)
తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. మనుషుల ప్రాణాల కంటే కులాలకు విలువనిచ్చే మృగాల సంఖ్య పెరిగిపోతోంది. పరువు కోసం కన్నబిడ్డల్ని పొట్టనబెట్టుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. 
 
వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని పెంచిన చేతులతోనే చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే నార్నూరు మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన రాజేశ్వరి, అదే గ్రామానికి చెందిన షేక్ అలీంను ప్రేమించింది. అయితే పెళ్లికి రాజేశ్వరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మూడు నెలల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 
 
ఇటీవలే వారిద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. దీంతో రాజేశ్వరి తండ్రి గామంలో పంచాయితీ పెట్టాడు. కొద్ది రోజుల వరకు విడివిడిగా ఉండాలని పెద్దలు చెప్పడంతో.. ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. దీంతో పాటు షేక్‌ అలీంను మరచిపోవాలని దేవదాస్.. కూతురు రాజేశ్వరిని హెచ్చరించాడు. 
 
అందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. విచారణలో దేవదాస్ నేరం అంగీకరించడంతో.. నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments