బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులకు అస్వస్థత

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (13:02 IST)
హైదరాబాద్ నగరంలోని పటాచెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ గురుకుల పాఠశాలకు చెందిన బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెదుతున్నారు. 
 
అస్వస్థతకు లోనైన విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఈ ముగ్గురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు లోనైన విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. 
 
కాగా, ఇటీవల ఈ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఇప్పటికే 37 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇపుడు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనుకావడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments