Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉస్మానియా క్యాంపస్‌లో సమాధి...

ఉస్మానియా క్యాంపస్‌లో సమాధి...
, సోమవారం, 29 నవంబరు 2021 (11:24 IST)
దేశంలోని ఎంతో పేరున్న విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. ఈ వర్శిటీ ప్రాంగణంలో ఒక సమాధి బయటపడింది. ఇది విద్యాలయంలో తీవ్ర కలకలం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆదివారం సాయంత్రం కాలేజీ హాస్టల్ వనుక స్థలానికి కొందరు విద్యార్థులు వెళ్ళారు. అపుడువారి కంటికి ఒక సమాధి కనిపించింది. దీన్ని చూడగానే వారు భయపడి తమ గదులకు పరుగులు తీశారు. 
 
ఆ తర్వాత హాస్టల్ వెనుక భాగంలో సమాధి ఉన్న విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పారు. చివరకు ఈ విషయం హాస్టల్ చీఫ్ వార్డెన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఈ సమాధిలో మనిషి పూడ్చిపెట్టారా? లేకా ఏదేని జంతువును పాతిపెట్టారా? అనే విషయంలో ఆరా తీస్తున్నారు. అయితే, హాస్టల్ క్యాంపస్‌లో సమాధి కనిపించడంతో విద్యార్థులు మాత్రం భయానికి లోనయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాలర్‌ శేషాద్రి మృతి త‌ర‌ని లోటు... ధ‌న్య‌జీవి: చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి