Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో పార్టీ.. కారులో సామూహిక అత్యాచారం.. హైదరాబాదులో ఘోరం

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (20:19 IST)
పార్టీ పేరుతో 17 ఏండ్ల బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ కారులోనే ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో ఈ దారుణ జరిగింది. గత నెల 28న శనివారం రాత్రి అమ్నీసియా అండ్ఇన్సోమ్నియా పబ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. 
 
స్నేహితులు పార్టీకి పిలిచారని బాధిత బాలిక పబ్‌కు వెళ్లగా.. ఆ రోజు రాత్రి బాలికపై సూరజ్, హాడీ అనే వ్యక్తులతో పాటు మరికొంతమంది దాడికి పాల్పడ్డారు. బాలికను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి స్పృహ కోల్పోయిన తర్వాత బాలికపై లైంగిక దాడి చేశారు. 
 
బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువకులు సూరజ్‌, హాడీలను పోలీసులు విచారిస్తున్నారు.
 
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన జూబ్లీ హిల్స్‌ పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. ఈ కేసులో బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ మ‌సివుల్లా ఖాన్ కుమారుడు మ‌హ్మ‌ద్ ఖాద‌ర్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌హ్మద్ ఖాద‌ర్ ఖాన్‌తో పాటు మ‌రో మైన‌ర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
 
అలాగే పరీక్షలు పూర్తైనందున విద్యార్ధులంతా గెట్ టూ గెదర్ పార్టీని పబ్ లో చేసుకున్నారని పబ్ మేనేజర్ సాయి చెప్పారు. గత నెల 28వ తేదీన విద్యార్థులంతాటెట్ టూ గెదర్ కోసం పబ్ ను బుక్ చేసుకొన్నారని సాయి తెలిపారు. 
 
ఈ పార్టీకి లిక్కర్‌ను అనుమతివ్వలేదని సాయి స్పష్టం చేశారు. సాయంత్రం పబ్ నుండి వెళ్లే సమయంలో పబ్ మెయిన్ గేట్ వద్ద కొద్దిసేపు మైనర్ బాలిక ఉందన్నారు. అయితే ఆమె మెడపై చేయి వేసి కొందరు తీసుకెళ్తన్నట్టుగా తాము చూశామన్నారు. పబ్‌లో ఎలాంటి చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. పబ్ లోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులకు అప్పగించామన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం