Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!!

వరుణ్
గురువారం, 4 జులై 2024 (08:58 IST)
తెలంగాణాలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే తొలి విడత టీఎస్ ఎంసెంట్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభణవుతుంది. ఈ తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 12వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో పాల్గొనదలచిన విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృపపత్రాల పరిశీలనకు హాజరయ్యే తేదీ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. 
 
ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెవ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వారికి ఈ నెల 19వ తేదీ లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయిస్తామని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
 
కాగా, గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఒక వెబ్‌సైట్, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు మరో వెబ్‌సైట్ ఉండేది. దాంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈ సారి ఈఏపీ సెట్ వెబ్‌సైట్ (www.eapcet.tsche.ac.in)లోకి వెళ్లినా అక్కడ అడ్మిషన్‌పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్‌సైట్ (www.tseapcet.nic.in)లోకి వెళ్లొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments