తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రొఫెసర్ కోదండరామ్!!

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (12:56 IST)
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత ప్రొఫెసర్ కోదండరామ్. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఈ మాజీ ప్రొఫెసర్‌ గత తొమ్మిదేళ్లుగా ఎక్కడున్నారో తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పక్కనే పెట్టుకున్న కె.చంద్రశేఖర్ రావు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు అనేక మందిని పక్కనపెట్టేశారు. అయితే, ఇపుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ కోదండరామ్ సూచనలు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 
 
నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్, కోదండరామ్‌లు పలు మార్లు కలిసి అనేక విషయాలపై చర్చించారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీతో టేజీఎస్ పొత్తుపెట్టుకుంది. అయితే, ఎన్నికల్లో తాను పోటీ చేయనని కోదండరామ్ చెప్పడంతో ఆ పార్టీకి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో కోదండరామ్‌ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వనున్నట్టు వార్తలు  వస్తున్నాయి. కోదండరామ్ తన పక్కన ఉంటే సీఎంగా తాను సక్సెస్ కావడానికి ఆయన సలహాలు, సూచనలు దోపదపడతాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments