ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (12:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. మాజీ నక్సలైట్ ఒకరు ఒక యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ అతని హత్యకు కారణమైంది. ఈ మాజీ నక్సలైట్‌ను ఓ యువకుడు హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సిరిసిల్ల జిల్లా వేములవాడ తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బల్లెపు సిద్ధయ్య అలియాస్ నర్సయ్య గతంలో ఓ నక్సలైట్‌గా పనిచేశాడు. కొద్ది కాలం క్రితం ఆయన ఓ యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తాని అజ్ఞాతంలో ఉన్న సమయంలో పలువురుని హతమార్చినట్టు చెబుతూ తాను చంపేసిన వారి పేర్లను కూడా వెల్లడించారు. 
 
ఈ ఇంటర్వ్యూను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు చూశాడు. తన తండ్రిని చంపింది నర్సయ్యేనని ఆ వీడియో ద్వారా నిర్ధారించుకున్నాడు. దీంతో  నర్సయ్యపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన పథకంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలం, అగ్రహారం గుట్టల్లోకి పిలిపించి దారుణంగా హతమార్చాడు. 
 
ఆ తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం ఒక ఇంటర్వ్యూ పాత పగను రగిల్చి హత్యకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments