Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి.. ఇంట్లో వదిలి కూలీకి వెళ్తే...

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (17:21 IST)
వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతులు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తమ బిడ్డ సాయితో కలిసి నివసిస్తున్నారు. 
 
రోజూలాగే మంగళవారం కూడా దంపతులు తమ ఐదు నెలల కుమారుడిని ఇంట్లో వదిలి కూలి పనులకు వెళ్లారు. పనిలో మధ్య లావణ్య నీళ్లు తాగేందుకు ఇంటికి తిరిగి రాగా ఇంటి దగ్గర ఓ కుక్క సంచరించడం గమనించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా కుమారుడిపై కుక్క దాడి చేసి కనిపించింది. వెంటనే కుటుంబీకులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
కుక్క ఫ్యాక్టరీ యజమానులదని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే, ఫ్యాక్టరీ యజమానులు తమ వద్ద పెంపుడు కుక్క లేదని, వీధి కుక్క పిల్లవాడిపై దాడి చేసి వుండవచ్చునని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments