ఐఎంజీ సంస్థకు భూములు.. పిటిషన్లను కొట్టేసిన కోర్టు.. బాబుకు ఊరట

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (19:01 IST)
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఐఎంజీ అనే సంస్థకు కేటాయించిన భూములపై విచారణ చేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. అక్రమాలు జరిగాయనడానికి ఆదారాల్లేవని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. 
 
క్రీడా సంబంధిత అంశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు అమెరికాకు చెందిన ఐఎంజీ కంపెనీ సబ్సిడరీ అయిన ఐఎంజీ భరతకు భూములు కేటాయించారు. కేబినేట్ నిర్ణయానికి అనంతరం ఈ భూముల కేటాయింపు జరిగింది. 
 
అయితే తదుపరి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఓటమి పాలైంది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కేటాయింపుల్ని రద్దు చేశారు.
 
అయితే ఆ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఈ భూములు కేటాయింపులపై విచారణ చేయించాలని 2012లో హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
 వీటిని  సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు దాఖలు చేశారు. అంటే భూముల కేటాయింపులు కూడా రద్దు చేసిన  తొమ్మిదేళ్ల తర్వాత అక్రమాలని  పిటిషన్లు వేశారు. 
 
వీటిని ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా ఈ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఇందులో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments