Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య (Video)

Advertiesment
sandhya

ఠాగూర్

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:26 IST)
అనారోగ్యంతో చనిపోయిన భర్త అంత్యక్రియలను తన బిడ్డతో కలిసి భార్య అడ్డుకుంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి - మంథని మండలం విలోచవరం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్య అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. 
 
అయితే, భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో యేడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమలో సునీల్ అనారోగ్యంతో మంచానపడ్డారు. ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో చనిపోయాడు. అంత్యక్రియలను మంథనిలోని గోదావరి ఒడ్డున నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సంధ్య తన బిడ్డతో సహా వెళ్లి తన భర్త ఆస్తి తనకు ఇవ్వాలంటూ సునీల్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నారు. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే, సునీల్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోటార్ ఇన్సూరెన్స్ స్కామ్‌కు వ్యతిరేకంగా అకూ లక్షలాది బైక్ యజమానులను రక్షిస్తుంది, అవగాహన ప్రోత్సాహం