ప్రముఖ డైరెక్ట్-టు-కస్టమర్ బీమా సంస్థ అయిన అకూ ఒక ముఖ్య మైన ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ స్కామ్‌ను ఛేదించింది. తమ ప్రైవేట్ ఫోర్-వీలర్ వాహనాలు, వాణిజ్య వాహనాలకు గాను తప్పుగా ద్విచక్ర వాహన బీమా పాలసీలను కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు సంబంధించి 200 మోసపూరిత కార్యకలాపాలను కంపెనీ ఇప్పటివరకు గుర్తించింది. ఐపీసీ సెక్షన్ 420 (మోసం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద దేశవ్యాప్తంగా ఈ మోసగాళ్లపై అకూ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి. బీమా మోసంలో పాల్గొనడం తీవ్రమైన పరిణామాలతో కూడిన తీవ్రమైన నేరం. బీమా మోసానికి పాల్పడిన వ్యక్తులు జరిమానాలు, జైలు శిక్షతో సహా క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కోవచ్చు. బీమాను కొనుగోలు చేసేటప్పుడు, క్లెయిమ్ చేసేటప్పుడు బీమా పరిశ్రమ పారదర్శకత, నమ్మకాన్ని కాపాడుకోవడానికి నిజాయితీ పద్ధతులకు కట్టుబడి ఉండటం చాలా అవసరం.
భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో డిజిటల్ మోటారు బీమా మోసాల కేసుల పెరుగుదలను అకూ గమనించింది.ఇటువంటి స్కామ్‌లను అకూ గుర్తించింది. సమాచారాన్ని తప్పుగా సూచించడం ఆధారంగా తీసుకున్న ఆ పాలసీలను రద్దు చేయడమే కాకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది. మోసం జరిగి నప్పుడు కేవలం ప్రతిస్పందించడానికి మించి ఈ బ్రాండ్ ధోరణి ఉంటుంది. అటువంటి దుష్ప్రవర్తనల గురించి పాలసీదారులకు తెలియజేయడానికి అకూ పబ్లిక్ నోటీసును జారీ చేసింది. ఈ విషయంలో కంపెనీ చురుగ్గా ప్రజల్లో అవగాహనను ప్రోత్సహిస్తుంది. జ్ఞానంతో తన వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. సంస్థ జారీ చేసిన పబ్లిక్ నోటీసులో మరియు తమ ధృవీకరించబడిన యాప్, వెబ్‌సైట్ నుండి నేరుగా పాలసీలను కొనుగోలు చేయడాన్ని నొక్కిచెప్పడం చూస్తే ఈ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ స్కామ్‌పై అకూ వీపీ (లిటిగేషన్ & ఇన్వెస్టిగేషన్) రాజేష్ ధానే వ్యాఖ్యానిస్తూ, అకూలో మాకు వినియోగ దారుల హక్కులు, భద్రత చాలా ముఖ్యమైనవి. మేం కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఏవైనా మోసపూరిత బీమా కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాం. తెరపైకి వచ్చి న ఇటీవలి కేసుల కోసం, అటువంటి మోసాలను గుర్తించడానికి, తొలగించడానికి మేం స్థానిక అధికారులకు చురుకుగా సహకరించాం. ఈ పద్ధతిని నిర్మూలించడాన్ని మేం విశ్వసిస్తున్నాం అని అన్నారు.
ఈ చురుకైన విధానం తన వినియోగదారులను రక్షించడంలో, బీమా మోసాన్ని ఎదుర్కోవడంలో అకూ కు గల తిరుగులేని నిబద్ధతను చాటిచెబుతుంది.
భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ స్కామ్‌లు అటు పాలసీదారులకు, ఇటు బీమా కంపెనీలకు ఆందోళన కలిగిస్తాయి, కాబట్టి, మోసగాళ్ల కథనాలను ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవడం చాలా అవసరం.
1. బీమా పాలసీని నేరుగా బీమా సంస్థ నుంచి కొనుగోలు చేయండి: ప్రామాణికమైన బీమా పాలసీని కొనుగోలు చేసినట్లు నిర్ధారించుకోవడానికి, వినియోగదారులు ఐఆర్ డీఏఐలో నమోదు చేసుకున్న అకూ వంటి బీమా సంస్థ నుండి నేరుగా బీమాను కొనుగోలు చేయాలి.
2. బీమా ప్రీమియం రసీదుల కోసం అడగండి: కస్టమర్లు ఎల్లప్పుడూ బీమా ప్రీమియం రసీదుని కో రాలి. ఒకవేళ కస్టమర్ పాలసీ నకిలీదని గుర్తిస్తే, మోసపూరిత బీమా సంస్థతో చట్టబద్ధంగా పోరాడు తున్నప్పుడు వారు తమ రసీదుని అందుకు రుజువుగా ఉపయోగించవచ్చు.
3. పాలసీ యొక్క ఫైన్ ప్రింట్ చదవండి: ప్రయోజనాలు, విశిష్టతలను అర్థం చేసుకోవడానికి బీమా పాలసీ నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా చదివినట్లుగా నిర్ధారించుకోండి. కస్టమర్లు పాల సీలో లోపాన్ని కనుగొంటే, బీమా సంస్థతో దాన్ని సరిదిద్దుకోవడం తెలివైన పని.
4. చెక్ / ఆన్‌లైన్ చెల్లింపు విధానం/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించండి: ఇది నేరుగా బీమా కంపెనీకి చెల్లిం పు చేయబడిందని నిర్ధారిస్తుంది మరియు చెల్లింపు బదిలీ చేయడానికి ముందు కస్టమర్లు ఎల్లప్పు డూ బ్యాంక్ వివరాలను క్రాస్ వెరిఫై చేయాలి.
5. క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరించుకోండి: ఐఆర్డీఐఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ప్రతి బీమా పాలసీకి క్యూఆర్ తప్పనిసరి. పాలసీ నిజమైనదా కాదా అని ధ్రువీకరించడానికి కస్టమర్‌లు కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. పాలసీ యొక్క క్యూఆర్ కోడ్ స్టేటస్ మరియు బీమా ప్లాన్ వివరాలను కలిగి ఉంటుంది, ఇది పాలసీ ప్రామాణికతను ధ్రువీకరించడంలో మీకు సహాయపడుతుంది.
6. ఖాళీ ఫామ్‌లు లేదా చెక్కులపై సంతకం చేయవద్దు: కస్టమర్లు పాలసీ పత్రాలను వారే స్వంతంగా పూరించాలని కోరడమైంది. మోసాన్ని నివారించడానికి గాను ఖాళీ కాగితం/ఫామ్‌పై సంతకం చేయవద్దు. ఖాళీ పత్రం లేదా చెక్కుపై సంతకం చేయడం ద్వారా కస్టమర్ సంతకం చేసిన ఫామ్‌ను ఉపయోగించి వేరే బీమా ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నకిలీ లేదా చట్టబద్ధమైన ఏజెంట్‌కు అవకాశం లభిస్తుంది.
7. అవాస్తవిక ప్రయోజనాల కోసం ఆశపడకండి: అవాస్తవిక ప్రయోజనాలు, విశిష్టతలను అందించే ఏజెంట్ల కాల్స్ లేదా విధానాలను అనుమానించడం మంచిది. ఏజెంట్లు లేదా బీమా కంపెనీలు పాలసీ పరిధికి మించి ప్రయోజనాలను అందించలేవు; అందువల్ల, నకిలీ ఆఫర్‌ల కోసం ఆశపడే ముందు బీమా కంపెనీతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి