పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (19:49 IST)
మొన్నటికి మొన్న హైదరాబాదులో ఆలయ ప్రదక్షణలు చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరవకముందే.. మేడిపల్లి మండలం మోతుకురావుపేటలో బుధవారం అర్థరాత్రి ఓ మ్యారేజ్ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ సంజీవ్ (23) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే.. కమ్మరికుంటకు చెందిన సంజీవ్‌ మోతుకురావుపేటలో జరిగే తన మేనమామ కుమారుడి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
23 ఏళ్ల యువకుడు కళ్ల ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. సంజీవ్ మృతితో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు వస్తుండడంతో చాలామంది భయపడిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments