Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (17:24 IST)
చార్మినార్ పరిధిలోని గుల్జర్ హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ అగ్నిప్రమాదంలో స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రిలో 14 మంది చనిపోయారని ఆయన వెల్లడించారు. ఈ మృతుల్లో ఎక్కువ మంది బెంగాల్ వాసులని ఆయన వెల్లడించారు. 
 
మృతుల్లో హైదరాబాద్ నగరంలోని బంధువుల ఇంటికి వచ్చిన బంధువులు కూడా ఉన్నారని మంత్రి పొన్నం తెలిపారు. అగ్నిప్రమాదంలో కింద ఫ్లోర్‌‍లో షాపు, మొదటి అంతస్తులో నివాసంతో పాటు కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ షాపులు కాలిపోయినట్టు వెల్లడించారు. గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి, అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. 
 
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి 
 
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) నాగిరెడ్డి వెల్లడించారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ళ వల్లే మంటలు వ్యాపించాయన్నారు. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయని తెలిపారు. మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని ఆస్పత్రికి తరలించాం. నిచ్చెన ద్వారా నలుగురు పై నుంచి కిందికి వచ్చారు. భవనంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన మెయిన్ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతుండేదని కార్మికులు చెబుతున్నారు. అగ్నిప్రమాద నివారఖు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అని నాగిరెడ్డి తెలిపారు. 
 
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17కు పెరిగిన మృతుల సంఖ్య 
 
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 17 మందికి చేరింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక తుదిశ్వాస విడిచారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్ పేట), డీఆర్డీవో, అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. 
 
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకున్నారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్‌ పరిససరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. 
 
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో రాజేంద్ర కుమార్, అభిషేక్ మోడీ, సుమిత్ర, మున్నీబాబు, ఆరుషి జైన్, శీతల్ జైన్, ఇరాజ్, హర్షాలీ గుప్తా, రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, రిషబ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్‌లు ఉన్నారు. 
 
అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు, ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments