Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గర్భవతి.. ఆరు రోజుల నవజాత కుక్కపిల్లల్ని దారుణంగా చంపిన భర్త.. సీసీటీవీలో? (video)

సెల్వి
గురువారం, 17 ఏప్రియల్ 2025 (10:54 IST)
Puppies
హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ సెల్లార్‌లో ఆరు రోజుల వయసున్న వీధి కుక్కపిల్లలను ఒక వ్యక్తి గోడకు కొట్టి, తన కాళ్లతో తొక్కి చంపిన దారుణమైన జంతు హింసకు సంబంధించిన ఘటన ఇది. ఈ సంఘటన స్థానికులను  దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణమైన సంఘటన మచ్చా బోలారామ్‌లోని గేటెడ్ సొసైటీ అయిన ఇండిస్ వీబీ సిటీలో జరిగింది. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు, వ్యాపారవేత్త, సొసైటీ నివాసి అయిన ఆశిష్, ఏప్రిల్ 14 తెల్లవారుజామున ఐదు కుక్కపిల్లలను చంపాడు. 
 
అతను తెల్లవారుజామున 1.20 గంటల ప్రాంతంలో సెల్లార్‌లోకి ప్రవేశించి, అక్కడ నవజాత కుక్కపిల్లలను కనుగొని గోడకు విసిరినట్లు ఫుటేజ్ చూపిస్తుంది. వాటిలో కొన్ని ఇంకా బతికే ఉండటంతో, అతను వాటి తలలను తన పాదాలతో తొక్కాడు. అవి చనిపోయాయని నిర్ధారించుకోవడానికి ఇటుకతో కొట్టాడని ఆరోపించారు. 
 
మంగళవారం నివాసితులు కుక్కపిల్లల చెల్లాచెదురుగా ఉన్న అవశేషాలను కనుగొన్నారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత వారు షాకయ్యారు. "ఆశిష్ తరచుగా వీధి కుక్కలను వేధించడం, వాటిపై రాళ్ళు విసరడం, కర్రలతో కొట్టడం చూశాను" అని నివాసి సత్తార్ ఖాన్ అన్నారు. 
 
ఈ ఘటనపై జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి మాట్లాడుతూ, "వీధులపై ఇటువంటి క్రూరమైన చర్యలు పెరుగుతున్నాయి. ఇటువంటి క్రూరత్వాన్ని అరికట్టడానికి కఠినమైన శిక్ష విధించాలి" అని అన్నారు. దీనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్ SHO రాహుల్ దేవ్ ఫిర్యాదు అందిందని ధృవీకరించారు. "ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడుతుంది. తదుపరి దర్యాప్తు జరుగుతుంది" అని ఆయన అన్నారు. ఇంకా నిందితుడి భార్య గర్భవతి అని.. తన భర్త చేసిన దుశ్చర్యకు ఆమె షాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం