Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

Advertiesment
green mango

సెల్వి

, బుధవారం, 16 ఏప్రియల్ 2025 (20:53 IST)
తెలంగాణ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మామిడి చెట్లకు వివాహ వేడుకలు సంప్రదాయం, పర్యావరణం, భక్తిని మిళితం చేస్తూ జరిగాయి. బీరాపూర్ మండలంలోని తుంగూరు గ్రామంలో, పండ్ల తోట యజమాని ఒగుల అజయ్ కుమార్ తన 8 ఎకరాల పొలంలో రెండు మామిడి చెట్లకు వివాహ ఉత్సవాన్ని నిర్వహించారు.
 
ఈ మామిడి తోటలో వరుసగా నాలుగు సంవత్సరాలుగా దిగుబడి లేకపోవడంతో ఈ సీజన్‌లో మామిడి కాయలు బాగా పండటంతో.. మామిడి చెట్లను కొత్త వస్త్రంతో, బంగారం, జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో అలంకరించారు. బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పూజారి సత్తుపర్తి మధు కుమారాచార్యులు ఆచారాలు నిర్వహించారు. 
 
"సంవత్సరాల నిరాశ తర్వాత, ఈ సీజన్‌లో చెట్లు ఫలాలను ఇచ్చాయి. మేము సాంప్రదాయ వివాహ వేడుక ద్వారా మా కృతజ్ఞతను తెలియజేయాలని ఎంచుకున్నాం" అని అజయ్ కుమార్ అన్నారు. ఆ చెట్లను పార్వతిపరమేశ్వరులుగా భావించి.. కల్యాణం నిర్వహించినట్లు అజయ్ కుమార్ వెల్లడించారు. 
webdunia
Mango Flowers
 
ఇంతలో, రుద్రంగి మండలంలోని తూర్పు వాడాలో, ముదిరాజ్ సంఘం మామిడి చెట్లకు వేద మంత్రోచ్ఛారణలు, ఆచారాలతో గొప్ప కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించింది. మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు సహా స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
మామిడి సాగుదారులలో ఇటువంటి వివాహాలు పూర్వీకుల సంప్రదాయం అని, ఆరోగ్యకరమైన పంట కోసం దైవ అనుగ్రహం, ఆశీర్వాదాలను కోరుతారని కమ్యూనిటీ పెద్దలు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్