Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

ఠాగూర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (17:29 IST)
తనపై అక్రమంగా చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపినా తన భార్య వర్షిణి మాత్రం తనతోనే ఉంటుందని లేడీ అఘోరి నాగసాధు అంటున్నారు. ఓ మహిళ ఇచ్చిన మేరకు హైదరాబాద్ నగర మోకిలా పోలీసులు మోసం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాగసాధు వద్ద పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణ అనంతరం నాగసాధును అరెస్టు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు. 
 
దీనిపై అఘోరీ స్పందిస్తూ, తాను జైలుకు వెళ్లినా తన భార్య నాతోనే ఉంటుందని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, తాను జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి మాత్రం తనతోపాటు ఉంటుందని అఘోరీ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ 
 
చీటింగ్ కేసులో అరెస్టయిన మహిళా అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు. దీనిపై లాయర్ స్పందిస్తూ, బెయిల్ ఎపుడు వస్తుందో చెప్పలేమని, చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు. 
 
ఈ కేసులో అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం అవకాశం ఉందన్నారు. తనకు కేసు పేపర్లు మాత్రమే ఇస్తారని, ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. అఘోరీకి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తుందని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, పూజల పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకుని, మోసం చేసిన కేసులో పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేవెళ్ళ కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో అఘోరీకి న్యాయమూర్తి రిమాండ్ విచారించారు. ఈ కేసులో కోర్టులో ఉందని, ఈ కేసులో పోలీసులకు సహకరిస్తానని అఘోరీ తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments