కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (14:04 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నట్టుండి ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరిగిపోగా, సోడియం స్థాయి మాత్రం పడిపోయాయి. దీంతో ఆయన స్వల్ప అస్వస్థతకు లోనుకావడంతో హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం వైద్యం అందిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దృష్ట్యా కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలిసిన భారాస కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 
 
సాధారణ వైద్య పరీక్ష కోసమే తన తండ్రి ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఆయన ఆరోగ్య సూచికలన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాగా, గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కేసీఆర్‌ను గురువారం సాయంత్రం యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచన మేరకు ఆస్పత్రిలో చేర్పించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో కేసీఆర్ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్టు తేలిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments