Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

Advertiesment
hostel building

ఠాగూర్

, గురువారం, 12 జూన్ 2025 (19:04 IST)
అహ్మదాబాద్‌ నగరంలో గురువారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 242 మంది దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషాద ఘటనలో మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, కొందరు వ్యక్తులు వలంటీర్ల ముసుగులో రెసిడెంట్ డాక్టర్స్ ముసుగులో హాస్టల్‌లోని సేఫ్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులను దోచుకున్నారని అధికారులు తెలిపారు. నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన పట్ల పౌరులు, అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, స్థానికులు తెలిపిన వెల్లడించిన సమాచారం మేరకు.. ఘటనా స్థలంలో హృదయ విదాకర దృశ్యాలు కనిపించాయి. ఓ వ్యక్తి తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు అని ఓ స్థానికుడు కన్నీటిపర్యంతమయ్యాడు. అదే అంతస్తు నుంచి దూకిన ఓ మ
నుంచి దూకడం కనిపించింది.  
 
పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!
 
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ మహా విషాదం గురువారం మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం.. విమానాన్ని ఓ పక్షి ఢీకొనడం వల్లే జరిగివుంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 
 
ఈ ఘటనపై నిపుణులు స్పందిస్తూ, టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొనివుండొచ్చని, దాని కారణంగానే విమానం టేకాఫ్‌కు అవసరమైన వేగాన్ని ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసివుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
విమానరంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలెట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ స్పందిస్తూ, ప్రాథమికంగా చూస్తే ఇది కొన్ని పక్షుల ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనవల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండొచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే, గేర్లను పైకి తీసుకొచ్చే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినపుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినపుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది" అని అన్నారు. 
 
ఈ దృశ్యాలను చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లుంది. విమానం నియంత్రిత పద్దతిలోనే కిందకు వచ్చింది. పైలెట్ మే డే కాల్ ఇచ్చారు. అంటే అది అత్యవర పరిస్థితి అని అర్థం అని నొక్కి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)