Webdunia - Bharat's app for daily news and videos

Install App

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

సెల్వి
శనివారం, 14 డిశెంబరు 2024 (19:54 IST)
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు. కేసీఆర్ ఇప్పటివరకు అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లలేదు. అంతే కాదు.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్.. చేపట్టిన విదేశీ పర్యటనలు కేవలం రెండంటే రెండు మాత్రమే. అందులో ఒకటి సింగపూర్, రెండోది చైనా. 
 
అంతకు మించి కేసీఆర్.. తన జీవితకాలంలో దేశం దాటలేదు. అయితే తొలిసారి.. అమెరికాకు కేసీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. సుమారు 35 ఏళ్లకుపైగా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్న కేసీఆర్.. కేవలం రెండే రెండు ఫారిన్ టూర్‌లతో.. దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. 
 
తాజాగా అమెరికా వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు నెలల్లో కేసీఆర్ అమెరికా ప్రయాణం ఉంటుందని తెలుస్తోంది. అమెరికా వెళ్లనున్న కేసీఆర్.. సుమారు 2 నెలల పాటు అక్కడే ఉండే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 
 
తన మనవడు హిమాన్షు కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. కొన్ని రోజులు అమెరికా వచ్చి రెస్ట్ తీసుకోవాలని.. ఇటీవల ఇండియా వచ్చిన హిమాన్షు తాతను కోరినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

అల్లు అర్జున్ కలిసిన ఉపేంద్ర.. మంచి మనిషి అని కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments