Webdunia - Bharat's app for daily news and videos

Install App

Baby Girl: ఆడపిల్ల పుట్టిందని పండగ చేసుకున్న తండ్రి.. ఎక్కడో తెలుసా?

సెల్వి
సోమవారం, 9 డిశెంబరు 2024 (18:06 IST)
ఆడపిల్లలు పుడితే ఎంతగానో బాధపడేవారు ఇప్పటికీ వున్నారు. . ఈ రోజుల్లో ఆడపిల్లకు విలువ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ తండ్రి చేసిన పనిని చూస్తే మాత్రం ఇలాంటి అదృష్టం ప్రతి ఆడపిల్లకు కావాలని కోరుకుంటాం. అమ్మాయి పుట్టిందని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఊరంతా చీరలు పంచాడు ఓ తండ్రి. 
 
జగిత్యాల జిల్లా బీర్​పూర్ మండలం తుంగూరులో ఓగులపు అజయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. తండ్రి అజయ్‌ మహాలక్ష్మి పుట్టిందని ఊరిలోఉన్న ప్రతి మహిళకు చీరల పంపిణీ చేశాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఘనంగా సంబురాలు చేసుకున్నాడు. 
 
అంతేకాదు 1500 చీరలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఇంటికి మహాలక్ష్మి వంచిందని సంతోషంగా చీరలను పంపిణీ చేసినట్లు అజయ్ తెలిపారు. అజయ్ బతుకుదెరువు కోసం దుబాయ్​లో పని చేసేవాడు. అక్కడ ఉన్న సమయంలో రెండేళ్ల క్రితం రూ.30 కోట్ల లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. 
 
ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఇంటింటికీ ఉచితంగా చీరలు పంపిణీ చేశానని అజయ్ చెప్పుకోచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ పై బిగ్‌బీ అమితాబచ్చన్‌ ప్రశంసలు

ఎన్టీఆర్, ఏఎన్నార్ చేయాల్సినంత గొప్ప పాత్ర హరికథ సిరీస్ తో దక్కింది : రాజేంద్రప్రసాద్

వేదిక నటించిన ఫియర్ ట్రైలర్ థ్రిల్ కలిగించింది : మాధవన్

బాక్సాఫీస్ వద్ద వైల్డ్‌ఫైర్ బ్లాస్ట్... 4 రోజుల్లో 'పుష్ప-2' రూ.829 కోట్లు వసూలు

ఎనిమిదేళ్ల క్రిితం రశ్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) ను సెట్ లో కలిశా : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

తరచూ జలుబు చేయడం వెనుక 7 కారణాలు

Black Tea బ్లాక్ టీ తాగితే 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ లక్షణాలను ఎదుర్కోడానికి అవగాహన అవసరం అంటున్న నిపుణులు

సూర్యరశ్మితో 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments