కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందన్నారు. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సాహిస్తామని, సమాజంలో గౌరవనీయమైన జీవితాన్ని కల్పిస్తామని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణలో 54 మంది ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఇంతవరకు ఎవరూ సాహసించని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను ప్రతీ ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలన్నారు. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నామని.. వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇకపై ట్రాన్స్‌జెండర్ల ఆర్థికస్థితి మెరుగు పరిచేందుకు మరిన్ని పథకాలు తీసుకు వస్తామని తెలియజేశారు. అలాగే ట్రాన్స్ జెండర్ల కోసం భారీ సంఖ్యలో "మైత్రి ట్రాన్స్ క్లినిక్స్" ప్రారంభించామని చెప్పారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం చేశారు. తమను గుర్తించి ట్రాఫిక్ వాలంటీర్లుగా విధుల్లోకి తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో వివక్షకు గురవుతున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందని వారు వెల్లడించారు.