Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

iPhone 15 plus: ఐఫోన్ల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త!!

iPhone 12 Pro

ఠాగూర్

, సోమవారం, 9 డిశెంబరు 2024 (13:52 IST)
ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలని వారికి ఇది నిజంగానే శుభవార్త. గత సెప్టెంబరు నెలలో ఐఫోన్ 16 సిరిస్ మోడల్ ఫోన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు మరోమారు అదేపరిస్థితి రానుంది. 16 సిరీస్ మోడల్ అందుబాటులోకి రావడంతో పాత మోడల్ అయిన ఐఫోన్ 15 మోడల్ ఫోన్ల రేట్లు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. 2023లో విడుదలైన ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ ప్రస్తుతం గణనీయమైన తగ్గింపు ఆఫరుతో అందుబాటులో రానుంది. 
 
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఐఫోన్ 15 ప్లస్ 128జీబీ మోడల్‌‍పై భారీ ధర తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ అసలు రేటు రూ.89,600గా ఉండగా ఏకంగా 22 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే కేవలం రూ.69,900లకే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి మరో రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీంతో రూ.64,900లకే కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది. 
 
అదేసమయంలో పాత స్మార్ట్‌ఫోనును ఎక్చేంజ్ చేసుకుంటే మరింతగా ధర తగ్గనుంది. కాగా, ఐఫోన్ 15 ప్లస్ డిస్‌ప్లే 6.7 అంగుళాలుగా ఉంది. డిస్‌ప్లే గీతలు పడకుండా గట్టి గాజుతో ప్రొటెక్షన్ ఉంది. నీటిలో తడిసినా ఏమీ కాదు. ఇక ఫోను అద్భుతమైన కెమెరా సిస్టమ్ ఉంది. హైక్వాలిటీతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చు. గరిష్ఠంగా 512 జీబీ స్టోరేజీ మోడల్ అందుబాటులో ఉంటుంది. కాగా ఐఫోన్ 15 ప్లస్‌ను 5-6 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. శక్తిమంతమైన ప్రాసెసింగ్ చిప్‌తో పనితీరు బాగానే ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hindutva A Disease హిందుత్వ అనేది ఒక జబ్బు : ముఫ్తీ కుమార్తె ఇల్తీజా