Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ‘దీపావళి షాపోత్సవ్’ 2024: సభ్యుల కోసం ప్రత్యేక డీల్‌లు, ఆఫర్‌లు

image

ఐవీఆర్

, గురువారం, 17 అక్టోబరు 2024 (23:16 IST)
భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చెందిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క డిజిటల్ బి 2బి మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, దాని బి 2బి సభ్యుల కోసం 2024 అక్టోబర్ 9 నుండి నవంబర్ 1వ తేదీ మధ్య దీపావళి షాపోత్సవ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘డీల్స్ ఆప్కే లియే కుషియాన్ సబ్కే లియే’ ట్యాగ్ లైన్ తో నిర్వహించబడుతున్న ఈ సేల్ ఈవెంట్ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ యొక్క మొత్తం 26 స్టోర్‌లు, ఆన్‌లైన్ ఛానెల్‌లలో అందుబాటులో ఉంటుంది.
 
కిరాణా భాగస్వాములు అన్ని ఉత్పత్తి విభాగాలలో గొప్ప డీల్‌లను పొందవచ్చు. కంపెనీ తమ బి2బి సభ్యులకు మరింత పొదుపు, లాభాలను పెంచుకునే అవకాశాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ హెడ్ ఆఫ్ స్ట్రాటజీ & ట్రాన్స్‌ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్- గ్రూప్ హెడ్ దినకర్ అయిలవరపు మాట్లాడుతూ, “కిరాణా సభ్యులు, ఎస్ఎంఈలు (చిన్న- మధ్యతరహా పరిశ్రమలు) ఇతర వ్యాపార యజమానులకు పండుగల సీజన్‌లో వినియోగదారుల అవసరాలను తీరుస్తూనే, తమ పొదుపును పెంచుకోవడానికి, లాభాలను మెరుగుపరుచుకోవటానికి అవకాశాన్ని దీపావళి షాపోత్సవ్ అందిస్తుంది.
 
అనుకూలమైన డీల్‌లు, ఆఫర్‌ల ద్వారా, స్థిరమైన, లాభదాయకమైన మార్గంలో వారి వ్యాపార వృద్ధికి మద్దతు ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ వద్ద, కిరాణా పర్యావరణ వ్యవస్థ కోసం శాశ్వత విలువను సృష్టించడం, వారి కార్యకలాపాలను బలోపేతం చేయడం, విజయాన్ని సాధించడంలో వారికి సాధికారత కల్పించడం పరంగా నిబద్ధత పట్ల మేము స్థిరంగా వున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

CRC ది ఫ్లాగ్‌షిప్ నుంచి 56 ఎలివేటర్లు, ఎస్కలేటర్‌ల కోసం ఆర్డర్‌ని అందుకున్న హిటాచీ